KTR: రూపాయి విలువ పడిపోతుంటే.. రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో వెతుకుతున్నారు: కేటీఆర్

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి(₹81.18)కి పడిపోవడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

Updated : 23 Sep 2022 12:03 IST

హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి(₹81.18)కి పడిపోవడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్విటర్‌ వేదికగా కేంద్రం తీరుపై కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని చెప్పారు. విశ్వగురువును పొగడండి’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

తొలి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉంది..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అవార్డుల్లో తెలంగాణకు ప్రథమ స్థానం రావడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు పోతుందని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని