Lokesh: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అరాచకపర్వానికి వైకాపా తెరతీసింది: లోకేశ్‌

జగన్ నియంత పోకడలకు తట్టుకోలేకనే నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా తెదేపాలో చేరారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.  

Published : 04 Mar 2024 13:26 IST

అమరావతి: ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఆయన నియంత పోకడలను తట్టుకోలేకే నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా ఇటీవల తమ అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారన్నారు. ఇది జీర్ణించుకోలేని సీఎం.. తెదేపా నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.

‘‘మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల ఇళ్లపైకి పోలీసులను పంపించి భయానక వాతావరణం సృష్టించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఈ సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తక్షణమే జోక్యం చేసుకోవాలి. జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధికార పార్టీ అరాచకపర్వానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పరిశీలకులను పంపించాలి. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలి’’ అని ఈసీని లోకేశ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు