Motkupalli Narasimhulu : చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించాలి: మోత్కుపల్లి
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు.
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.
‘జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి. జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వైఎస్ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదు. దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు. ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్‌లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? ’’ అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి నిలదీశారు.
చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని మోత్కుపల్లి అన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పని చేశారు. నేను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పని చేశాను. రాజకీయాలు పక్కనపెట్టి కేసీఆర్ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది. నేను భారాసలోనే ఉన్నాను. కానీ, వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్టుపై స్పందించాను. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారు.’’ అని మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని.. అదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్‌తో సినిమా ఉంటుంది: సందీప్
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్