Nara Lokesh: వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌: లోకేశ్‌

జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Updated : 17 Feb 2024 14:53 IST

శృంగవరపుకోట: జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన తెదేపా ‘శంఖారావం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్ర ప్రజల కన్నీరు నుంచి బాబు సూపర్‌ 6 మేనిఫెస్టో వచ్చింది. దీనిని చూసి జగన్‌ భయపడుతున్నారు. క్రికెటర్‌ వైకాపాలోకి వస్తే ఎంతిస్తావని అతడిని అడిగారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చారు. జగన్‌ పాలనలో ముమ్మాటికీ జరిగింది సామాజిక అన్యాయమే. బీసీలంటే జగన్‌కు చిన్నచూపని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్‌ను కూడా ఇవ్వలేదు. ఎర్ర బుక్‌ చూసి కూడా జగన్‌ వణికిపోతున్నారు. ఆయన కటింగ్‌.. ఫిటింగ్‌ మాస్టర్‌. పచ్చ బటన్‌ నొక్కి రూ.10 వేసి.. ఎర్ర బటన్‌ నొక్కి రూ.100 లాగుతున్నారు. త్వరలో గాలిపై కూడా పన్ను వేస్తారేమో. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని