Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి

మంత్రుల కమిటీ సమావేశంలోనూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయమే జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆక్షేపించారు.

Updated : 06 Jun 2023 14:31 IST

మంగళగిరి: మంత్రుల కమిటీ సమావేశంలోనూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయమే జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆక్షేపించారు. ఓవైపు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి.. మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. కొత్త పీఆర్సీకి కమిటీ పేరుతో మరోసారి కాలయాపనకు కుట్రపన్నుతున్నారని.. సీఎం జగన్‌ మరోసారి ఉద్యోగులను మోసం చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. 

ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) రద్దుపై  రాష్ట్ర ప్రభుత్వ  ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్‌ పథకం(జీపీఎస్‌) అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులకు 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఉండేలా జీపీఎస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని, దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని