Revanth Reddy: కేసీఆర్‌కు ఓటమి భయం.. అందుకే రుణమాఫీ: రేవంత్‌ రెడ్డి

శ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణ త్యాగాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Updated : 15 Aug 2023 14:14 IST

హైదరాబాద్‌: దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణ త్యాగాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ నేడు ప్రధానంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, నెహ్రూలను స్మరించుకోవాలన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ దేశాన్ని ఆర్థికంగా పురోగతి వైపు నడిపించారని చెప్పారు. 

‘‘దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. భాజపా వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు. కానీ పెరిగింది.. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయి. కేసీఆర్‌ ఓటమి భయంతోనే రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానంటున్నారు. ఆయన ఏం చెసినా ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ వస్తుంది.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇంటి నిర్మాణానికి ప్రతిపేదవాడికి రూ.5లక్షలు ఇస్తాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది’’ అని రేవంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని