Palnadu: పల్నాడు ఎస్పీపై ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు

తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పల్నాడు జిల్లా ఎస్పీపై తెదేపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Published : 20 Feb 2024 21:39 IST

అమరావతి: పల్నాడు జిల్లా ఎస్పీపై తెదేపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని నరసరావు పేట పార్టీ ఇన్‌ఛార్జి అరవింద బాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలకు పల్నాడు ఎస్పీ మద్దతుగా ఉంటున్నారని ఆరోపించారు. ఎస్పీ వైఖరితో పల్నాడు జిల్లాలోని చాలా పోలింగ్ స్టేషన్లల్లో రిగ్గింగ్ జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. నరసరావు పేట ఎమ్మెల్యే, స్థానిక ఎన్నికల సిబ్బందిపైనా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచనల మేరకు ఏకపక్షంగా పోలింగ్ స్టేషన్ల మార్పలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని