YS Viveka Murder Case: వివేకా హత్య కేసుపై తెదేపా వెబ్‌సైట్‌

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలతో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రత్యేక వెబ్‌సైట్‌ (vivekanandareddykinyayam.in) రూపొందించింది. అందులో హత్యకేసుకు సంబంధించిన వివరాలను పొందుపరిచింది.

Updated : 27 Jul 2023 14:29 IST

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) వివరాలతో తెదేపా (TDP) ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించింది. వివేకానందరెడ్డికిన్యాయం.ఇన్‌ పేరుతో రూపొందించిన ఆ వెబ్‌సైట్‌లో ఆయన నేపథ్యం - వంశవృక్షం, హత్య అనంతర ఘటనల కాలక్రమం, పలుమార్లు మాట మార్చిన జగన్‌, కీలక వ్యక్తుల ప్రకటనలు అన్న నాలుగు ప్రధాన కేటగిరీలుగా సమాచారాన్ని పొందుపరిచారు.కేసు పరిణామక్రమం, తక్షణ ఘటనలు, రాష్ట్ర ప్రభుత్వ విచారణ, సీబీఐ విచారణ, ఛార్జిషీట్లు అన్న విభాగాల కింద తేదీల వారీగా సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

మాటల నానీ.. చేతలు ఏవీ?

జగన్‌ (Jagan), అవినాష్‌ రెడ్డి (Avinash Reddy), విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) వంటివారు మాట్లాడిన వీడియోలను, వివేకా హత్య కేసుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఏ ఛార్జిషీటు దాఖలు చేసినా.. వైకాపా ముఖ్యనాయకులు వక్రభాష్యం చెబుతూ, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఈ కేసు పూర్వాపరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే వెబ్‌సైట్‌ రూపొందించామని తెదేపా వర్గాలు తెలిపాయి. ఇందులో సమాచారాన్ని తెలుగు లేదా ఇంగ్లిష్‌లలో చదువుకునే సౌలభ్యం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని