Gudivada: మాటల నానీ.. చేతలు ఏవీ?

కొడాలి నాని.. నాలుగు పర్యాయాలుగా గుడివాడ శాసనసభ్యుడు. అయితే.. ఆయన మాటల్లో ఉన్న ఒరవడి.. అభివృద్ధిలో లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు.

Updated : 27 Jul 2023 12:24 IST

గుడివాడ బస్టాండు కాదు... పడవల రేవు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుడివాడ: కొడాలి నాని.. నాలుగు పర్యాయాలుగా గుడివాడ శాసనసభ్యుడు. అయితే.. ఆయన మాటల్లో ఉన్న ఒరవడి.. అభివృద్ధిలో లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ బస్టాండు సంవత్సరాలుగా లోతట్టు ప్రాంతంలో ఉంది. దీనిని ఎత్తు పెంచి పునర్నిర్మిస్తామని పలుమార్లు నాని హామీనిచ్చారు. దీనికి నిధులూ మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని చెబుతూనే ఉన్నారు. ఆ దిశగా అడుగు పడనేలేదు. వానొచ్చిన ప్రతిసారీ ప్రయాణికులు ఇదిగో ఇలా తల్లడిల్లుతూనే ఉన్నారు. బుధవారం గుడివాడ బస్టాండ్‌ సమీపంలోని ఘంటసాల ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి రోజా.. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సైతం ఇటుగానే వెళ్లినా ప్రజల కష్టాలు వారికి కన్పించకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని