Palnadu: పల్నాడు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా నేతలపై లాఠీఛార్జి

వరికపూడిసెల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని శనివారం నరసరావుపేటలో తెదేపా నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 

Updated : 27 Jan 2024 17:52 IST

నరసరావుపేట అర్బన్‌: వరికపూడిసెల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నరసరావుపేటలో తెదేపా నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టును ప్రారంభించాలని నినాదాలు చేస్తూ నరసరావుపేట తెదేపా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం వద్దకు అనుమతించకుండా పోలీసులు గేట్లు వేయడంతో ప్రధాన రహదారిపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. తెదేపా హయాంలో నిధులు కేటాయించినా వాటిని వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులతో కలిసి వస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని నేతలు మండిపడ్డారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా, జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సీనియర్‌ నేతలు జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈక్రమంలో పోలీసులు, తెదేపా నేతలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు