Kishan reddy: ‘కేరళ స్టోరీ’ సినిమా వీక్షించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

దేశ ప్రజలు కేరళ స్టోరీ సినిమాను వాస్తవానికి అనుగుణంగా తీసినట్టు భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 16 May 2023 20:05 IST

హైదరాబాద్‌: దేశ ప్రజలు కేరళ స్టోరీ సినిమాను వాస్తవానికి అనుగుణంగా తీసినట్టు భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, అలాంటి ఘటనలను యావత్‌ సమాజం ఖండించాలన్నారు. హైదరాబాద్‌ నారాయణగూడ శాంతి థియేటర్‌లో భాజపా శ్రేణులతో కలిసి కిషన్‌రెడ్డి ‘కేరళ స్టోరీ’ సినిమాను వీక్షించారు. 

ఈ సినిమా గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి చూడాలనుకున్నానని, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి చూసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. కేరళ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కేరళ స్టోరీ సినిమాలో చూపించినట్లుగా ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ చిత్రాన్ని వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శక, నిర్మాతలు చెప్పారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆడ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళలను ఐసిస్‌ ఉగ్రవాదులు ఏ విధంగా హింసించారో చూశామని, మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని