Tokyo olympics : నిరాశపరిచిన అతాను దాస్‌

ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో మంచి ప్రదర్శన చేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్తాడని భావించిన స్టార్‌ ఆర్చర్‌ అతాను దాస్‌ శనివారం ఉదయం నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో అతడు జపాన్‌ ఆర్చర్‌ తాకాహరు ఫురుకవా చేతిలో...

Updated : 31 Jul 2021 10:35 IST

టోక్యో: ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో మంచి ప్రదర్శన చేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్తాడని భావించిన స్టార్‌ ఆర్చర్‌ అతాను దాస్‌ శనివారం ఉదయం నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో అతడు జపాన్‌ ఆర్చర్‌ తాకాహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్‌లోని 8వ రింగ్‌లో తృటిలో లక్ష్యాన్ని చేరుకోకపోవడమే దాస్‌ ఓటమికి కారణమైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఫురుకవా స్వల్ప తేడాతో ఆధిక్యం సంపాదించి ముందుకు దూసుకెళ్లాడు.

ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్‌ వైవిధ్యంగా ఉంటుందని, అక్కడి పరిస్థితులు, క్రీడాకారుల ఆలోచనా ద్రక్పథం అన్నీ మరోలా ఉంటాయని మ్యాచ్‌ అనంతరం దాస్‌ పేర్కొన్నాడు. ఇక్కడ తాను ఓడిపోయినా శక్తిమేరకు పోరాడానని చెప్పాడు. ఎక్కువగా ఆందోళన చెందానని అన్నాడు. వచ్చేసారి ఇంకా బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో దాస్‌ నాలుగుసార్లు 10 పాయింట్లు సాధించినా 8వ రింగ్‌లో అన్నేసార్లు మిస్‌ఫైర్‌ అయ్యాడు. దాంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌ నుంచే నిష్క్రమించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ దాస్‌ 4-6 తేడాతోనే కొరియన్‌ ఛాంపియన్‌ లీ సింగ్యన్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని