Covid: విరుష్క జోడీ విరాళాల సేకరణ 

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ..

Updated : 07 May 2021 12:02 IST

ముంబయి : దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ.. విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించారు. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందన్న విరాట్‌.. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ketto వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు విరుష్క దంపతులు ఓ వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.

రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విరుష్క జంట తెలిపింది. దీని ద్వారా రూ.7 కోట్లు సమీకరించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది.

‘కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తోంది. వైద్యారోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగింది. కోహ్లీ, నేను కలిసి విరాళాల సేకరణ చేపడుతున్నాం. మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. దేశానికి, భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ముందడుగు వేయండి. మీరు అందించే సహకారం ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది’ అని అనుష్క శర్మ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని