Icc World Cup 2023: చెదిరిన స్వప్నం.. ఆసీస్‌కే పట్టం

ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియాన్ని నీలి జెర్సీలతో నింపేసిన లక్షా ముప్ఫైవేల మంది ప్రేక్షకులు.. టీవీల ముందు కూర్చున్న కోట్లమంది నిశ్శబ్దంగా నిట్టూర్చిన సందర్బాలు ఎన్నెన్నో!

Updated : 20 Nov 2023 06:54 IST

ఆస్ట్రేలియాకు ఆరోసారి ప్రపంచకప్‌
రోహిత్‌సేన  జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్‌

ఆటల్లో భారీ సంఖ్యలో ఉన్న అభిమానగణాన్ని నిశ్శబ్దపరచడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి లేదు. మా లక్ష్యం అదే’’

భారత్‌తో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ముంగిట ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ చేసిన వ్యాఖ్య ఇది.

దివారం నరేంద్ర మోదీ (Narendra Modi Stadium) స్టేడియాన్ని నీలి జెర్సీలతో నింపేసిన లక్షా ముప్ఫైవేల మంది ప్రేక్షకులు.. టీవీల ముందు కూర్చున్న కోట్లమంది నిశ్శబ్దంగా నిట్టూర్చిన సందర్బాలు ఎన్నెన్నో! ఆరంభంలోనే శుభ్‌మన్‌ (Shubman Gill) ఔటైపోయినపుడు నిశ్శబ్దం.. చెలరేగి ఆడుతున్న రోహిత్‌ శర్మ (Rohit Sharma) పెవిలియన్‌ చేరినపుడు నిశ్శబ్దం.. శ్రేయస్‌ (Shreyas iyer) ఇలా వచ్చి అలా వెళ్లిపోయినపుడు నిశ్శబ్దం.. నిలకడగా ఆడుతున్న కోహ్లి (Virat Kohli) వెనుదిరిగినపుడు ఇంకా ఇంకా నిశ్శబ్దం.. ఆస్ట్రేలియా (Australia) ఇన్నింగ్స్‌ సాగుతున్నపుడూ బంతి బౌండరీకి చేరిన ప్రతిసారీ నిశ్శబ్దమే! ఇక ఆ గెలుపు పరుగు పూర్తయిన క్షణాన భరించలేని నిశ్శబ్దం! మన ప్రయాణం పడుతూ లేస్తూ సాగి ఉంటే.. అదృష్టం వల్లే మన జట్టు ముందంజ వేసి ఉంటే.. జట్టులో ఏవైనా లోపాలు కనిపించి ఉంటే.. ఆశలు, అంచనాలు తగ్గించుకునేవాళ్లం! కానీ ఎన్నడూ చూడని ఆధిపత్యం.. ఎవ్వరు ఎదురొచ్చినా తగ్గేదేలేదన్నట్లుగా సాగిపోయిన రోహిత్‌సేనను చూశాక.. ప్రపంచకప్పుకి భారత్‌ మూడో ముద్దు ఇచ్చేయబోతుందనే అనుకున్నాం. కానీ ఊహించనిది జరిగింది.. కల చెదిరింది.. కప్పు చేజారింది.. అందుకే ఈ ఓటమి జీర్ణించుకోలేనిది.. బ్యాటుతో అదరగొట్టు.. బంతితో పడగొట్టు.. ఈ ప్రపంచకప్‌ అంతా టీమ్‌ ఇండియాది ఇదే మంత్రం! కానీ ఫైనల్లో మాత్రం రోహిత్‌ సేన బ్యాటుతో ఆశించిన స్థాయిలో కొట్టలేదు. బంతితో పడగొట్టనూలేదు. అద్భుత బౌలింగ్‌.. మెరుపు వేగంతో కూడిన ఫీల్డింగ్‌.. సమయోచిత బ్యాటింగ్‌.. వెరసి ఆధిపత్యం మొత్తం ఆస్ట్రేలియాదే. ఆతిథ్య జట్టు ప్రణాళికలన్నింటినీ ఛిద్రం చేస్తూ కంగారూలు.. ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయారు.


6

ఆస్ట్రేలియా సాధించిన వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లు. 1987, 1999, 2003, 2007, 2015లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.


2

ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓడిన సందర్భాలు. 2003లో తుదిపోరులోనూ  ఆస్ట్రేలియా చేతిలోనే పరాజయం పాలైంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు