CSK vs MI: చెన్నై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. ముంబయిపై విజయం

CSK vs MI: ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం సాధించింది.

Updated : 06 May 2023 19:41 IST

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) మళ్లీ విజయాల బాట పట్టింది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians)పై విజయం సాధించింది. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చెన్నై బౌలర్లు అదరగొట్టడంతో ముంబయి 139/8కే పరిమితమైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవాన్‌ కాన్వే (44; 42 బంతుల్లో 4 ఫోర్లు), రుతురాజ్‌ గైక్వాడ్ (30; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అజింక్య రహానె (21), అంబటి రాయుడు (12) పరుగులు చేశారు. శివమ్ దూబె (25; 17 బంతుల్లో 3 సిక్స్‌లు) ధోని (2; 3 బంతులు )నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో పీయూష్‌ చావ్లా రెండు, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ఆకాష్‌ మద్వాల్‌ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి బ్యాటర్లలో నేహల్ వధేరా (64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్ (26), ట్రిస్టన్ స్టబ్స్‌ (20) పరుగులు చేశారు. కామెరూన్‌ గ్రీన్‌ (6), ఇషాన్‌ కిషన్ (7), రోహిత్‌ శర్మ (0) విఫలమవడంతో ముంబయి 14 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన నేహల్ వధేరా, సూర్యకుమార్‌ యాదవ్‌ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. చివర్లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న టిమ్ డేవిడ్ (2) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యాడు. చెన్నై బౌలర్లలో పతిరాణా (3/15), దీపక్‌ చాహర్‌ (2/18) ఆకట్టుకున్నారు. తుషార్‌ దేశ్‌పాండే 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

ఓవర్‌ టు ఓవర్‌ మ్యాచ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని