IND vs PAK: భారత్‌లో పాక్‌ పర్యటన.. మా చేతుల్లో లేదు.. ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి: పీసీబీ ఛైర్మన్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నూతన ఛైర్మన్‌గా నజామ్‌ సేథి బాధ్యతలు  చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌లో పాక్‌ పర్యటిస్తుందా..? లేదా..? అనే విషయంపై పీసీబీ గత ఛైర్మన్‌ రమీజ్‌ రజాలా కాకుండా నజామ్‌ విభిన్నంగా స్పందించారు.

Updated : 27 Dec 2022 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నమెంట్ భారత్‌ వేదికగా జరగనుంది. టాప్‌ జట్లు వస్తాయని భారత క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా, పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా మాత్రం పరస్పర విరుద్ధ ప్రకటనలతో హడావుడి చేశారు. 

పాక్‌లో జరిగే ఆసియా కప్‌ 2023లో భారత్‌ పాల్గొనబోదని.. తటస్థ వేదికపైనే తలపడుతుందని జయ్ షా వెల్లడించాడు. అలా జరిగేతే తాము వన్డే ప్రపంచకప్‌లో ఆడేది లేదని రమీజ్‌ రజా చెప్పాడు. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు కొత్త ఛైర్మన్‌ వచ్చాడు. దీంతో మరోసారి పీసీబీ స్పందన ఎలా ఉండబోతోందనే ఉత్కంఠకు కొత్త ఛైర్మన్‌ నజామ్‌ సేథి తెరదింపారు. 

‘‘పాకిస్థాన్‌, భారత్‌ దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు ఆందోళనకరంగా ఉన్నాయనే నేపథ్యంలో స్పందించాల్సి వస్తోంది. పాకిస్థాన్‌ జట్టు అక్కడ ఆడటం, పర్యటించడం తదితర నిర్ణయాలు తీసుకోవాల్సింది పీసీబీ కాదు. ఎందుకంటే అది ప్రభుత్వ స్థాయికి సంబంధించిన అంశం. పీసీబీ కేవలం క్లారిటీ కోసం ఎదురు చూడటమే. అలాగే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌తోనూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటాం. పరిస్థితిని గమనిస్తూనే ఉంటూ నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని