MSD : నేను అనుకున్నదానికి ధోనీ పూర్తిగా వ్యతిరేకం : డుప్లెసిస్‌

 నాయకత్వంలో టీమ్‌ఇండియా మాజీ సారథి, సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ శైలిని...

Published : 14 Mar 2022 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్: తన నాయకత్వం టీమ్‌ఇండియా మాజీ సారథి, సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ శైలిని పోలి ఉంటుందని ఆర్‌సీబీ నూతన కెప్టెన్ ఫా డుప్లెసిస్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథిగా దక్షిణాఫ్రికా బ్యాటర్ ఫా డుప్లెసిస్‌ నియమితుడైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లపాటు ఎంఎస్ ధోనీతో ప్ర్రయాణించడం అదృష్టమని పేర్కొన్నాడు. ‘‘క్రికెట్‌ జర్నీలో అద్భుతమైన నాయకులతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దక్షిణాఫ్రికా అత్యుత్తమ కెప్టెన్‌ గ్రేమీ స్మిత్‌తో కలిసి పెరిగా. స్టీఫెన్‌ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన సారథులు. నాయకత్వంలో ధోనీ శైలితో నాకు కొంచెం పోలిక ఉంటుందని అనిపిస్తుంటుంది. మేమిద్దరం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాం’’ అని డుప్లెసిస్‌ చెప్పాడు.

‘‘తొలిసారి చెన్నై తరఫున ఆడేటప్పుడు ధోనీ నాయకత్వం చూసి ఆశ్చర్యానికి గురయ్యా. దక్షిణాఫ్రికాలో కెప్టెన్సీ దూకుడుగా ఉండేది. అయితే ధోనీ మాత్రం నిశ్శబ్దంగా, కూల్‌గా తన పని చేసుకుని పోయేవాడు. నేను మొదట్లో అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే నేను అప్పటి వరకు దక్షిణాఫ్రికా కల్చర్‌లో ఉండటం వల్ల అలా అనిపించింది. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టడం ఒత్తిడితో కూడుకున్నదేనని నాకు తెలుసు. నాయకత్వాల్లో వేర్వేరు స్టైల్స్‌ ఉంటాయి. అయితే ఎప్పటికీ సొంత శైలిని కలిగి ఉండటం ముఖ్యం’’ అని తనపై ధోనీ ప్రభావం ఎలా ఉంటుందో డుప్లెసిస్‌ వివరించాడు. అయితే తాను విరాట్‌గానో ధోనీ మాదిరిగానో ఉండేందుకు ప్రయత్నించనని డుప్లెసిస్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని