Rohit Sharma: రోహిత్.. నీకు దెబ్బ తగిలిన సంగతి అసలు గుర్తుందా?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (Ind vs Ban) రోహిత్ శర్మ (Rohit Sharma) గాయాన్ని సైతం లెక్క చేయకుండా జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. చివరి వరకూ హిట్ మ్యాన్ చేసిన పోరాటం ఫలించకపోయినా.. రోహిత్ పోరాటాన్ని అభిమానులు కొనియాడుతున్నారు.
నాయకుడు అంటే నడిపించేవాడు.. జట్టులో స్ఫూర్తి నింపేవాడు.. కష్టకాలంలో ముందుకొచ్చి ఆదుకొనేవాడు.. ఇలా ఒక్కటేంటి నాయకుడు గురించి చెప్పాలంటే చాలా మాటలే ఉన్నాయి. అయితే వాటికి నిలువెత్తు రూపాన్ని చూపించాల్సి వస్తే.. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్ శర్మను చూపించాలి. జట్టుకు విజయాన్ని అందించలేకపోవచ్చు గాక.. సిరీస్‌లో జట్టును నిలపలేకపోవచ్చు గాక.. కానీ అతడి పోరాట పటిమ అమోఘం. అద్వితీయం!!
బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితేనేం కొన ఊపిరితో ఉందనుకుంటున్న వన్డే క్రికెట్‌కి ఊపిరిలూదింది. ‘వన్డే మ్యాచా? ఎవరు చూస్తారు’ అని అనుకునే సగటు క్రికెట్ అభిమానికి ఎనలేని కిక్ నిచ్చింది. దానంతటికీ కారణం ఒకే ఒక్కడు.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఫీల్డింగ్ సమయంలో గాయంతో పెవిలియన్‌కి చేరిన రోహిత్.. బ్యాటింగ్‌లో తొమ్మిదో బ్యాటర్‌గా వచ్చాడు. అప్పటికి మ్యాచ్ భారత్ వైపు లేదు. కానీ ఎక్కడో చిన్న ఆశ. హిట్ మ్యాన్ ఈ రోజు హిట్ కొడతాడు అని. అవతలి వైపు బ్యాటర్లు.. బంతిని కనెక్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నా.. రోహిత్ ఉన్నాడనే ఆశ అభిమానుల్లో ఉంది.
అనుకున్నట్లుగా రోహిత్ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. ఎడమ చేతి బొటన వేలి గాయమైందనే విషయం కూడా ప్రేక్షకులు మరచిపోయేంతగా బ్యాటింగ్ చేశాడు. ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ పరుగులు, లెక్కలు రోహిత్ కష్టానికి కొలమానం అస్సలు కాదు. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా మైదానంలోకి దిగాడు. యువతకు అంకిత భావం అంటే ఏమిటి? జట్టు కోసం ఏం చేయాలి? అని ఏవైనా తరగతులు చెప్పాలనుకుంటే.. ఈ మ్యాచ్ చూపిస్తే సరి అన్నట్లుగా ఆడాడు.
ఇక ఫలితం అంటారా? అది ఒక్క రోహిత్ చేతిలోనే లేదు. తన బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోని పంపించాడు. ఒక్కో షాట్‌కి ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరి బంతికి ఆరు పరుగులు కొట్టాల్సిన సమయంలో అనుకున్న షాట్ ఆడలేకపోయాడు. చివరికంటూ పోరాడి ఒక్క మెట్టు దూరంలో ఓటమిని అంగీకరించాడు. కానీ, గాయం తన పోరాట పటిమను ఏమాత్రం తగ్గించలేకపోయిందని నిరూపించాడు. ఓ యోధుడిలా పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌కు ప్రత్యర్థి ప్రేక్షకులు, వీక్షకులూ చప్పట్లతో అభినందించారు. ఇలాంటి ఫీట్‌లు రోహిత్‌కే సాధ్యమని సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఇన్నాళ్లు సాధించిన సెంచరీలు, డబుల్ సెంచరీలు ఎంత గొప్పవో.. ఈ రోజు సాధించిన అర్ధ సెంచరీనీ వాటితోనే పోలుస్తున్నారు అభిమానులు.
ఈ రోజు రోహిత్ ఆట చూసి మనం చేయగలిగేవి రెండే. ఒకటి.. మనసారా థాంక్స్ చెప్పుకోవడం! వేలి గాయం నుంచి త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని కోరుకోవడం!!
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు