Team India: ఒక్క విజయం.. టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్న భారత్‌..!

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించడానికి భారత్‌(Team India) సిద్ధంగా ఉంది. నేడు బెంగళూరు వేదికగా అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ ఘనత సాధించేందుకు రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది.

Updated : 17 Jan 2024 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌(T20 world cup 2024) ముందు ఆడుతున్న ఏకైక సిరీస్‌(IND vs AFG)లో టీమ్‌ఇండియా(Team India) అదరగొడుతోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. ఈ ఫార్మాట్‌లో ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధంగా ఉంది. అఫ్గానిస్థాన్‌పై నేడు బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌(Historic whitewash)లు చేసిన జట్టుగా భారత్‌ అవతరిస్తుంది.

ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక వైట్‌వాష్‌లు(8) చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా కొనసాగుతున్నాయి. నేడు అఫ్గాన్‌తో మూడో టీ20లో విజయం సాధిస్తే.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించనుంది.

చుట్టేస్తారా?.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి

ఇక అఫ్గాన్‌పై అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి 2-0 తేడాతో భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసిన రోహిత్‌ సేన.. మూడో టీ20లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్‌ నేడు ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే.. టీ20 ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన సారథి రోహిత్‌.. మూడో టీ20లో అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని