Shreyas Iyer : శ్రేయస్‌ సారథ్యంలో కోల్‌కతాకు ఉజ్వల భవిష్యత్తు: పఠాన్‌

శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో కోల్‌కతాకు మంచి భవిష్యత్తు ఉందని...

Published : 02 Apr 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో కోల్‌కతాకు మంచి భవిష్యత్తు ఉందని టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ఈసారి టీ20 టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. ఇవాళ పంజాబ్‌తో మూడో మ్యాచ్‌ను కోల్‌కతా ఆడనుంది. ఈ సందర్భంగా పఠాన్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత, తెలివైన సారథి. దిల్లీ జట్టుకు మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకుని రికీ పాంటింగ్ పర్యవేక్షణలో దిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. కెప్టెన్‌గా అతడి నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు’’ అని పఠాన్‌ వెల్లడించాడు.

ఆటగాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ విషయంలో శ్రేయస్‌ ఎప్పుడూ ముందుంటాడని పఠాన్‌ పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత సీజన్‌లో శ్రేయస్‌ కెప్టెన్సీ ఎత్తుగడలు బాగున్నాయని, టోర్నీలో మ్యాచ్‌లు జరిగే కొద్దీ దాని గురించి మరింత మాట్లాడుకోవచ్చు. అతడు ప్లేయర్ల కెప్టెన్‌. ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడు. ఇది నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం. అందుకే చెబుతున్నా శ్రేయస్‌ పర్యవేక్షణలో కోల్‌కతా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని