బంగ్లాలో ఆడటం గురించి సేథీ మాట్లాడలేదు: పీసీబీ

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మ్యాచ్‌ల్ని బంగ్లాదేశ్‌లో ఆడతామంటూ ఐసీసీ బోర్డు సమావేశంలో తమ ఛైర్మన్‌ నజమ్‌ సేథీ మాట్లాడలేదని పీసీబీ స్పష్టంచేసింది.

Published : 01 Apr 2023 02:30 IST

లాహోర్‌/దిల్లీ: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మ్యాచ్‌ల్ని బంగ్లాదేశ్‌లో ఆడతామంటూ ఐసీసీ బోర్డు సమావేశంలో తమ ఛైర్మన్‌ నజమ్‌ సేథీ మాట్లాడలేదని పీసీబీ స్పష్టంచేసింది. పాక్‌లో పర్యటనకు భారత్‌ నిరాకరించడంతో హైబ్రిడ్‌ పద్ధతిలో ఆసియా కప్‌ను నిర్వహిస్తామని మాత్రమే సేథీ అన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ ప్రతిపాదన ఆసియా కప్‌కే పరిమితమని పేర్కొంది. ‘‘తటస్థ వేదికపై భారత్‌ మ్యాచ్‌లు.. మిగతావి పాక్‌లో నిర్వహించేందుకు ఏసీసీలో చర్చలు జరుగుతున్నాయి’’ అని పీసీబీ వివరించింది. ‘‘గురువారం మీడియా సమావేశంలో ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదు. 2023 ప్రపంచకప్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయం ఇప్పటి వరకు ఐసీసీ వేదికల్లో చర్చకు రాలేదు’’ అని సేథీ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని