Ricky Ponting: కోహ్లి రిటైరయ్యాకే సచిన్‌తో పోలుస్తా: పాంటింగ్‌

సచిన్‌ తెందుల్కర్‌ సాంకేతికంగా అత్యుత్తమ బ్యాటర్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. కోహ్లి రిటైరయ్యాకే అతణ్ని సచిన్‌తో పోలుస్తానని చెప్పాడు.

Updated : 24 Apr 2023 06:51 IST

దిల్లీ: సచిన్‌ తెందుల్కర్‌ సాంకేతికంగా అత్యుత్తమ బ్యాటర్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. కోహ్లి రిటైరయ్యాకే అతణ్ని సచిన్‌తో పోలుస్తానని చెప్పాడు. ‘‘నా ప్రత్యర్థుల్లో, నేను కలిసి ఆడిన వారిలో సచినే సాంకేతికంగా అత్యుత్తమ బ్యాటర్‌. మేము బౌలింగ్‌లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగినా.. అతడు మమ్మల్ని సమర్థంగా ఎదుర్కొనేవాడు. నా తరంలో నేను చూసిన వారిలో సాంకేతికంగా అత్యుత్తమ బ్యాటర్‌ సచినే’’ అని పాంటింగ్‌ అన్నాడు.

అయితే ఇప్పుడే సచిన్‌తో కోహ్లిని పోల్చడానికి అతడు తిరస్కరించాడు. ‘‘ఆట మారింది. నిబంధనలు మారాయి. ఇప్పుడు బ్యాటింగ్‌ చేయడం తేలిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అతడు చాలా మంచి బ్యాటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లి రిటైరయ్యే దాకా వేచి చూద్దాం. ఆ తర్వాత సచిన్‌తో పోల్చడం సమంజసమవుతుంది’’ అని పాంటింగ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని