ఆమెను ఎందుకు గేలి చేశారు?

రొలాండ్‌ గారోస్‌లో ప్రేక్షకులు ఉక్రెయిన్‌ క్రీడాకారిణి మార్తా కోస్త్యుక్‌ను గేలి చేశారు.

Published : 29 May 2023 02:30 IST

పారిస్‌: రొలాండ్‌ గారోస్‌లో ప్రేక్షకులు ఉక్రెయిన్‌ క్రీడాకారిణి మార్తా కోస్త్యుక్‌ను గేలి చేశారు. ఆదివారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో బెలారస్‌కు చెందిన సబలెంక చేతిలో పరాజయంపాలైన కోస్త్యుక్‌.. మ్యాచ్‌ అనంతరం ఆమెతో కరచాలనం చేయకపోవడమే అందుకు కారణం. ఆమె కనీసం సబలెంక కళ్లలోకి కూడా చూడడానికి ఇష్టపడలేదు. నెట్‌ దగ్గరికి వెళ్లి ఆమెతో చేయి కలపకుండా నేరుగా చైర్‌ అంపైర్‌ దగ్గరకు వెళ్లింది. కొంతకాలంగా రష్యా లేదా బెలారస్‌ ప్రత్యర్థి ఎదురైన ప్రతిసారీ కోస్త్యుక్‌ ఇలాగే చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోన్న రష్యాకు బెలారస్‌ సహకరిస్తోంది. ఈ కోపంతోనే ఆ దేశాల క్రీడాకారులను కోస్త్యుక్‌ పలకరించట్లేదు. బహుశా ఈ నేపథ్యం గురించి తెలియకపోవడం వల్లే.. సంప్రదాయం ప్రకారం గెలిచిన ప్రత్యర్థిని అభినందించలేదనే ఉద్దేశంతో కోస్త్యుక్‌ను ప్రేక్షకులు గేలి చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు