క్వార్టర్స్‌లో లక్ష్య, కిరణ్
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లక్ష్యసేన్, కిరణ్‌జార్జ్ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ లక్ష్యసేన్ 21-17, 21-15తో నాలుగో సీడ్ లిషి ఫెంగ్ (చైనా)ను ఓడించాడు.
సైనా, సాత్విక్ జోడీ ఔట్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లక్ష్యసేన్, కిరణ్‌జార్జ్ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ లక్ష్యసేన్ 21-17, 21-15తో నాలుగో సీడ్ లిషి ఫెంగ్ (చైనా)ను ఓడించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కిరణ్ 21-11, 21-19తో వెంగ్ హంగ్ యంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించాడు. కిరణ్ ర్యాంకు 59 కాగా.. యంగ్ 29వ ర్యాంకర్ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 11-21, 14-21తో మూడో సీడ్ బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. ఇంకో ప్రిక్వార్టర్స్‌లో అస్మిత 18-21, 13-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీకి ఊహించని ఫలితం ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో ఇండోనేసియా అన్‌సీడెడ్ ద్వయం షోయ్‌బుల్-బగాస్ 24-26, 21-11, 21-17తో భారత జంటను కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన భారత జోడీ రెండో గేమ్‌ను అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. మూడో గేమ్‌లో ఆరంభంలో 1-5తో వెనుకబడిన సాత్విక్ జోడీ.. ఆ తర్వాత 12-17తో పుంజుకునేలా కనిపించింది. కానీ పట్టువదలని ఇండోనేసియా జంట భారత్ జోడీకి ఓటమిని మిగిల్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు