The Gabba: గబ్బా స్టేడియాన్ని కూలగొట్టి..

బ్రిస్బేన్‌లోని ప్రఖ్యాత గబ్బా స్టేడియాన్ని కూలగొట్టి ఆధునాతన వసతులతో నిర్మించబోతున్నారు. 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గబ్బానే ప్రధాన స్టేడియంగా ఎంపికైంది. బ్రిస్బేన్‌ స్టేడియాన్ని కూల్చి మళ్లీ కట్టడానికి సుమారు 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర అధికారి తెలిపాడు.

Updated : 25 Nov 2023 08:23 IST
బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌లోని ప్రఖ్యాత గబ్బా స్టేడియాన్ని(The Gabba) కూలగొట్టి ఆధునాతన వసతులతో నిర్మించబోతున్నారు. 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గబ్బానే ప్రధాన స్టేడియంగా ఎంపికైంది. బ్రిస్బేన్‌ స్టేడియాన్ని కూల్చి మళ్లీ కట్టడానికి సుమారు 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర అధికారి తెలిపాడు. అయితే వాలిడేషన్‌ నివేదికను ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ మొదలు కానుంది. కొత్తగా భూమార్గ రైల్వే స్టేషన్‌ను నిర్మించి గబ్బాకు మిగిలిన ప్రాంతాలకు అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యాల్లో ఒకటి. అంతేకాక సీట్ల సంఖ్యను 50 వేలకు పెంచాలనేది అధికారుల యోచన. 2025లో గబ్బాలో యాషెస్‌ టెస్టు పూర్తయిన తర్వాత స్టేడియం నిర్మాణ పనులు మొదలుపెట్టి 2030 నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. ఇందుకోసం స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలను వేరే చోటకు మార్చబోతున్నారు. మెల్‌బోర్న్‌ (1956), సిడ్నీ (2000) తర్వాత ఒలింపిక్స్‌ నిర్వహించే సువర్ణావకాశాన్ని బ్రిస్బేన్‌ దక్కించుకుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని