టీ20 సిరీస్‌కు చాహర్‌ అనుమానం

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ పాల్గొనడం అనుమానమే.

Updated : 11 Dec 2023 17:29 IST

దిల్లీ: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ పాల్గొనడం అనుమానమే. తన తండ్రి ఆరోగ్య అత్యవసర స్థితి కారణంగా ఆస్ట్రేలియాతో అయిదో టీ20 మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న చాహర్‌.. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాకు చేరుకోలేదు. ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న చాహర్‌ మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘‘కుటుంబ సభ్యుడి అనారోగ్యం కారణంగా చాహర్‌  ఇంకా డర్బన్‌ చేరుకోలేదు. ఇందుకు అతను అనుమతి తీసుకున్నాడు’’ అని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈనెల 12, 14 తేదీల్లో తర్వాతి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని