శ్రీజకు కెరీర్‌ ఉత్తమ ర్యాంకు

భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆకుల శ్రీజ కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఈ   తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది.

Published : 27 Mar 2024 01:47 IST

దిల్లీ: భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆకుల శ్రీజ కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఈ   తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. డబ్ల్యూటీటీ ఫీడర్‌ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో టైటిల్‌ గెలిచిన  శ్రీజ.. ఏడు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. మనిక బత్రా 38... అర్చన కామత్‌ 99వ స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు బీరుట్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సత్యన్‌.. పురుషుల సింగిల్స్‌లో ఏకంగా 43 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంకులో నిలిచాడు. వెటరన్‌ ఆటగాడు శరత్‌ కమల్‌ ఒక స్థానం కోల్పోయి 35వ ర్యాంకులో నిలవగా.. మానవ్‌ థక్కర్‌ 63, హర్మీత్‌దేశాయ్‌ 67 ర్యాంకులు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని