INDW vs PAKW : పాక్‌పై అదరగొట్టిన భారత బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం..!

కామన్వెల్త్‌ కీలక పోరులో భారత అమ్మాయిల జట్టు బౌలింగ్‌లో అదరగొట్టింది. సెమీస్‌ బెర్తు ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో..

Updated : 31 Jul 2022 18:00 IST

పాకిస్థాన్‌ను 99కే కట్టడి చేసిన టీమ్‌ఇండియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ కీలక పోరులో భారత అమ్మాయిల జట్టు బౌలింగ్‌లో అదరగొట్టింది. సెమీస్‌ బెర్తు ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన పాక్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 100 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రాధా యాదవ్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రనౌట్ సహా మూడు వికెట్లు పడ్డాయి. మునీబా అలీ 32, బిస్మా మరూఫ్ 17, అయేషా 10, అలియా రియాజ్ 18, ఫాతిమా 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, రాధా యాదవ్‌ 2.. షఫాలీ వర్మ, రేణుకా సింగ్, మేఘ్నా సింగ్‌ చెరో వికెట్ తీశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు