CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ (IPL 2023) ప్రారంభం కానుంది. ఇరు జట్లూ ఆల్‌రౌండర్లతో నిండిపోవడంతో మాంచి క్రికెట్ మజా మాత్రం అభిమానులకు ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) చరిత్రలో నాలుగు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మరోసారి విజేతగా నిలవడానికి సమాయత్తమైంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (GT vs CSK) చెన్నై తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అంతర్జాతీయంగా టాప్ ఆల్‌రౌండర్లు సీఎస్‌కే (CSK) ఫ్రాంచైజీ సొంతం. రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, మొయిన్ అలీతోపాటు యువ ఆటగాడు శివమ్ దూబే, దీపక్ చాహర్ కూడా ఇటు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించగల సమర్థులు కావడం సీఎస్‌కేకు సానుకూలాంశం. అయితే వీరందరిలోకి ఎవరు బెస్ట్ అంటే అందుకు తాను సమాధానం చెబుతానని అంటున్నాడు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ అద్భుతమైన ఆల్‌రౌండర్లని.. అయితే వీరిద్దరితో పోలిస్తే రవీంద్ర జడేజా ప్రత్యేకమైన ఆటగాడిగా భజ్జీ అభివర్ణించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్ జడేజానేనని పేర్కొన్నాడు.
ఓ క్రీడా ఛానెల్‌తో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ జడేజాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ సీజన్‌లో నా దృష్టంతా రవీంద్ర జడేజా ప్రదర్శనపైనే ఉంది. సీఎస్‌కే కోసం ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తాడనేది ఆత్రుతగా ఉంది. ఈ సీజన్‌లో జడ్డూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొస్తాడని అనిపిస్తోంది. తన నాలుగు ఓవర్ల కోటా కీలకమవుతుంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో జడేజా కంటే అత్యుత్తమ ఆల్‌రౌండర్ మరొకరు లేరు. అందుకే, ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనను చూసేందుకు ఉత్సాహంతో ఉన్నా’’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు.
గుజరాత్ టైటాన్స్‌కు తమ బ్యాటింగ్ విభాగం అనుకూలంగా ఉండటం గతేడాది కలిసొచ్చిందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇతర జట్ల కంటే అద్భుతంగా రాణించడానికి ప్రధాన కారణం కూడా అదేనని చెప్పాడు. ‘‘గతేడాది ఛాంపియన్‌గా నిలవడానికి గుజరాత్‌కు తమ బ్యాటింగ్ విభాగంలో ఉన్న నాణ్యతే కారణమైంది. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. కీలకమైన పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. జాంటీ రోడ్స్ చెప్పినట్లు ‘ఆహ్లాదకరంగా ఉండే జట్టు విజయం సాధిస్తుంది’.. గుజరాత్‌కు సరిగ్గా సరిపోయింది. కోచ్ ఆశిశ్ నెహ్రాతోపాటు జట్టు మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలిచింది’’ అని భజ్జీ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!