
Memes corner: బాబ్బాబు..! పాతవేవీ మనసులో పెట్టుకోకురా.. కివీస్‌పై గెలవరా!
PC: CERTIFIED SATIRES
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే న్యూజిలాండ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆఖరి మ్యాచ్‌లో నమీబియాను భారత్ ఓడిస్తే నెట్‌రన్‌రేట్ పరంగా ముందున్న భారత్ సెమీస్‌కు చేరుతుంది. అందుకే కివీస్‌ను అఫ్గాన్ ఓడించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదే సందర్భమని భావించిన మీమర్స్ తమ క్రియేటివిటీకి పనిచెప్పారు. అఫ్గాన్ ఆటగాళ్లను టీమిండియా ఆటగాళ్లు బుజ్జగిస్తున్నట్లు, దేశ ప్రజలంతా అఫ్గాన్వైపే ఉన్నట్లుగా మీమ్స్ రూపొందిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఇదే అఫ్గాన్‌పై భారత్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ‘అమ్మనాన్న.. ఓ తమిళ అమ్మాయి’ సినిమాలోని ఫైట్‌సీన్‌ను స్ఫూఫ్‌గా చేసుకుని రూపొందించిన మీమ్ ఆకట్టుకుంటోంది. ‘బాబ్బాబు.. ఇవేవీ మనసులో పెట్టుకోకురా. న్యూజిలాండ్‌పై గెలవరా’ అంటూ రూపొందించిన మీమ్ నవ్వులు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్‌మీడియాలో చాలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో చూసేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana news: 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ranga Ranga Vaibhavanga: ‘ఖుషి’ని గుర్తుచేస్తోన్న ‘రంగ రంగ వైభవంగా’ టీజర్
-
World News
Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!
-
General News
CM Jagan: అందుకే 75% హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్
-
Politics News
Andhra News: ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు