ICC: ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి ఇమ్రాన్‌ ఖవాజా

ఐసీసీ అనుబంధ దేశం సింగపూర్‌ బోర్డుకు చెందిన ఇమ్రాన్‌ ఖవాజాకు మళ్లీ అత్యున్నత పదవి దక్కింది. ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి నియమించడం విశేషం.

Published : 26 Nov 2022 23:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ బోర్డు (ఐసీసీ) డిప్యూటీ ఛైర్మన్‌గా ఇమ్రాన్‌ ఖవాజా మరోసారి నియమితులయ్యారు. ఖవాజా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే అసోసియేట్‌ మెంబర్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తారు. 2008లో ఐసీసీ బోర్డులోకి  వచ్చిన ఖవాజా.. 2017 నుంచి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మరోసారి ఖవాజాను డిప్యూటీ ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం బార్‌క్లే మినహా ఎవరూ బరిలో లేకపోవడంతో ఖవాజానే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పోటీలో ఉంటాడని భావించినప్పటికీ .. సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జయ్‌షా, ఐసీసీ ఆర్థిక, వాణిజ్య అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే  ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీకి అధినేతగా గంగూలీ వ్యవహరిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని