IND vs SA: టీమ్‌ఇండియా ఘన విజయం.. సిరీస్ సమం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

Updated : 17 Jun 2022 22:48 IST

రాజ్‌కోట్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్ (55; 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డసెన్‌ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బవుమా (8) రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ విజయం సాధించింది. అవేశ్‌ ఖాన్‌ ఒకే ఓవర్‌లో డసెన్ (20), మార్కో జాన్‌సెన్‌ (12), మహరాజ్‌ (0)లను ఔట్‌ చేసి దక్షిణాఫ్రికా పతనంలో కీలక పాత్ర పోషించాడు. అవేశ్‌ ఖాన్ (4/18) కాకుండా.. చాహల్ రెండు, అక్షర్‌ పటేల్, హర్షల్‌ పటేల్ చెరో వికెట్‌ పడగొట్టారు. దక్షిణాఫ్రికాపై పరుగుల పరంగా టీమ్‌ఇండియాకిదే భారీ విజయం.

ఆదుకొన్న కార్తిక్, పాండ్య

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్ (5)తోపాటు వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ (4) విఫలమయ్యారు. అయితే కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో ఇషాన్‌ కిషన్‌ (27), పంత్ (17) పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య (46), దినేశ్‌ కార్తిక్ (55) అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దీంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని