ధోనీ, గిల్‌క్రిస్ట్‌ను పంత్‌ అధిగమిస్తాడు

టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇలాగే బ్యాటింగ్‌ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్‌ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌...

Published : 29 Mar 2021 01:32 IST

ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇలాగే బ్యాటింగ్‌ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్‌ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు. ఇటీవల పంత్‌ అన్ని ఫార్మాట్లలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో వన్డేలో పంత్‌(77; 40 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ను పొగిడాడు.

‘టీమ్ఇండియాకు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో దూకుడు తీసుకొచ్చింది రిషభ్‌పంత్‌. అతడి వల్లే టీమ్‌ఇండియా రన్‌రేట్‌ పెరిగింది. పంత్‌ని కొద్దికాలంగా ఫాలో అవుతున్నా. భిన్న స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తూ అద్భుతంగా పరుగులు చేస్తున్న తీరు అమోఘం. అతడు ఆడే విధానం, పరుగులు చేసే తీరు.. గత 30 ఏళ్లలో నేను ఇద్దరిలోనే చూశాను. వాళ్లే ధోనీ, గిల్‌క్రిస్ట్‌. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సమర్థులు. పంత్‌ ఇలాగే కొనసాగితే వాళ్లిద్దర్నీ అధిగమిస్తాడు’ అని ఇంజమామ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని