Rohit Sharma: ముంబయి జట్టును రోహిత్‌ నడిపిస్తాడు.. కానీ.. : మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హార్దిక్‌ కెప్టెన్సీలో ఆడుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma)పై శ్రీశాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 05 Apr 2024 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి జట్టు.. ఈ సీజన్‌(IPL)లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. కెప్టెన్సీ మార్పే ఇందుకు కారణమని పలువురు విమర్శిస్తున్నారు. రోహిత్‌ శర్మ(Rohit Sharma)ను కాదని.. హర్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పలువురు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌.. హార్దిక్‌ కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టపడతాడని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. ‘క్రికెట్‌ దిగ్గజమైన సచిన్‌.. ధోనీ కెప్టెన్సీలో ఆడలేదా..?ఆ సమయంలో ప్రపంచకప్‌ కూడా గెలిచాం కదా. ఇప్పుడు హార్దిక్‌ కెప్టెన్సీలో రోహిత్‌ ఆడటంపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. కానీ, హిట్‌మ్యాన్‌ స్వేచ్ఛగా ఆడటాన్నే ఇష్టపడతాడు. సారథ్య బాధ్యతలు లేకపోవడంతో గొప్పగా బ్యాటింగ్‌  చేస్తాడు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోనూ నిలుస్తాడు. ఇది అతడికి మంచి సీజన్‌ అవుతుంది. గతంలో అతడు ముంబయిని ముందుండి నడిపించాడు. ఇప్పుడు జట్టును వెనకనుంచి నడిపించబోతున్నాడని నేను నమ్ముతున్నాను’ అని శ్రీశాంత్‌ విశ్లేషించాడు.

‘మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఏ ఫ్రాంఛైజీకి ఆడినా.. రోహిత్‌లో మార్పు ఉండదు. వ్యక్తిగతంగా అతడికి క్లిష్ట సమయమే అయినప్పటికీ.. పరిస్థితులను అధిగమించి విజేతగా నిలుస్తాడు. ఈ సీజన్‌లో అతడు భారీగా పరుగులు చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను’ అని శ్రీశాంత్‌ వెల్లడించాడు. ఇప్పటికే మూడు ఓటములను మూటగట్టుకున్న ముంబయి తన తదుపరి మ్యాచ్‌లో దిల్లీతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని