Shubman Gill: ‘సారా అలీఖాన్‌తో డేటింగ్‌?’.. శుభ్‌మన్‌ గిల్‌ సమాధానమిదీ

ఓ చిట్‌చాట్‌కు హాజరైన శుభ్‌మన్‌ గిల్‌.. సారా అలీఖాన్‌తో డేటింగ్‌పై స్పందించాడు.

Published : 17 Nov 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ క్రికెటర్‌, ఓ హీరోయిన్‌ కలిసి ఓ చోట కనిపిస్తే చాలు వారి మధ్య ఏదో బంధం ఉందంటూ ఊహాగానాలు వ్యాపిస్తాయి. అవి ఎక్కడికో దారి తీస్తాయి. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill), బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ (Sara Alikhan)లది ఇదే పరిస్థితి. వీరిద్దరు ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కలిసి కనిపించడమే అందుకు కారణం. సంబంధిత ఫొటో నెట్టింట లీకవడమే ఆలస్యం ‘శుభ్‌మన్‌, సారా మధ్య ఏదో కథ నడుస్తుంది’ అంటూ హిందీ, ఆంగ్ల మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పుడిదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

శుభ్‌మన్‌ ఇటీవల పంజాబీ ప్రముఖ చిట్‌చాట్‌ షోకు వెళ్లాడు. వృత్తిపరమైన విశేషాలు అడిగి తెలుసుకున్న హోస్ట్‌ శుభ్‌మన్‌ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించింది. ‘‘బాలీవుడ్‌లో ఫిట్‌గా ఉండే నటి ఎవరు?’’ అని అడగ్గా ‘సారా అలీఖాన్‌’ అంటూ శుభ్‌మన్‌ తెలిపాడు. ‘‘సారాతో డేటింగ్‌ చేస్తున్నారా?’’ అనే ప్రశ్నకు ‘కావొచ్చు’ అని సమాధానమిచ్చాడు. శుభ్‌మన్‌ సమాధానంలో స్పష్టతలేదనుకున్న హోస్ట్‌ మరోసారి చెప్పండని కోరగా ‘‘అవ్వొచ్చు, కాకపోవచ్చు’’ అని అన్నాడు. అయితే, ఫిట్‌నెస్‌ హీరోయిన్‌ అంటూ సారా అలీఖాన్‌ పేరును చెప్పడంతో ‘ఈ క్రికెటర్‌ డేటింగ్‌లో ఉన్నాడు’ అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుభ్‌మన్‌ గతంలో.. సచిన్‌ తెందూల్కర్‌ తనయ సారాతో ప్రేమలో ఉన్నాడంటూ వదంతులొచ్చిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని