ఇది గెలిస్తే.. సిరీస్‌ గెలుస్తాం: ఆర్చర్‌ 

టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ధీమా వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే మూడో టెస్టులో...

Updated : 23 Feb 2021 10:05 IST

భారత్‌తో టెస్టు సిరీస్‌పై ఇంగ్లాండ్‌ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ధీమా వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే మూడో టెస్టులో తాము గెలవడం కీలకమని చెప్పాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు ఈ టెస్టు సిరీస్‌పై, పింక్‌బాల్‌ బంతిపై.. తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇప్పటికే 1-1తో నిలిచిన సిరీస్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు తప్పకుండా గెలుస్తామని ఆర్చర్‌ బదులిచ్చాడు.

‘మేం తప్పకుండా గెలుస్తాం. అయితే, అంతకన్నా ముందు మూడో టెస్టులో విజయం సాధించడం ముఖ్యం. ఇది గెలిస్తే నాలుగో మ్యాచ్‌ను డ్రా చేసుకుంటాం. మేం ఎప్పుడూ గెలవాలనే ఆడతాం. కానీ రాబోయే టెస్టు అత్యంత కీలకం. ఇది గెలిస్తే చివరి టెస్టును కోల్పోకుండా చూసుకుంటాం’ అని ఆర్చర్‌ వివరించాడు. అనంతరం పింక్‌బాల్‌పై మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఈ బంతి కూడా సాధారణ బంతిలాగే ఉంటుంది. పింక్‌ బంతితోనూ ఇంతకుముందు పలుమార్లు బౌలింగ్ చేశా’ అని ఇంగ్లాండ్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు