Ranji Trophy: 42వసారి రంజీ ఛాంపియన్‌గా ముంబయి.. ఫైనల్‌లో విదర్భ ఓటమి

ముంబయి విజేతగా నిలిచింది. కానీ, విదర్భ జట్టు మాత్రం వెనకడుగు వేయలేదు. భారీ లక్ష్యమైనా సరే చివరి వరకూ పోరాడింది.

Updated : 14 Mar 2024 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీని (Ranji Trophy) ముంబయి 42వ సారి కైవసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 350/5 స్కోరుతో విజయం దిశగా సాగిన విదర్భను ముంబయి బౌలర్లు కట్టడి చేయగలిగారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి జట్టును గెలిపించారు. దాదపు 8 ఏళ్ల తర్వాత ముంబయి రంజీ విజేతగా నిలిచింది. చివరిసారిగా 2015-16 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించి ముంబయి ఛాంపియన్‌ అయింది.

పోరాడిన విదర్భ..

విదర్భ కెప్టెన్ అక్షయ్ వడ్కర్ (102) సెంచరీ సాధించాడు. హర్ష్‌ దూబె (65)తో అక్షయ్ ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించాడు. సెంచరీ తర్వాత అక్షయ్‌.. కాసేపటికే హర్ష్‌ ఔట్‌ కావడంతో విదర్భ ఆశలు ఆవిరయ్యాయి.  కరుణ్ నాయర్‌ (74) రాణించగా.. అమన్‌ మోఖడే (32), అథర్వ తైడే (32), ధ్రువ్‌ షోరే (28) ఫర్వాలేదనిపించారు. యశ్‌ రాథోడ్ (7), ఆదిత్య సర్వతే (3), యశ్‌ ఠాకూర్ (6), ఉమేశ్‌ యాదవ్ (6) పెద్దగా పరుగులు చేయలేదు. ముంబయి బౌలర్లు తనుష్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్‌ దేశ్‌ పాండే 2.. శార్దూల్, షామ్స్‌ ములాని చెరో వికెట్‌ తీశారు. 

స్కోరు వివరాలు:

ముంబయి: తొలి ఇన్నింగ్స్‌ 224/10, రెండో ఇన్నింగ్స్‌ 418/10

విదర్భ: తొలి ఇన్నింగ్స్‌ 105/10, రెండో ఇన్నింగ్స్‌ 368/10

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని