
Cricket News: లారా అలా ఎలా ఆడావ్? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే : మురళీధరన్
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ బ్రియన్ లారా దిగ్గజ ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరూ అత్యుత్తమ క్రికెటర్లుగా కొనసాగారు. మరీ ముఖ్యంగా 2001 నాటి లంక-విండీస్ 3 టెస్టుల సిరీస్‌లో ఇద్దరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఆ సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసినా లారా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం గమనార్హం. మొత్తం 3 టెస్టుల్లో ఒక అర్ధశతకం, మూడు శతకాలతో 688 పరుగులు సాధించాడు. అయితే, ఆ సిరీస్‌లో లారా ఆడిన తీరు తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుందని మురళీధరన్ గుర్తుచేసుకున్నాడు. ఆ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ యూట్యూబ్‌లో పంచుకుంది.
‘ఆ సిరీస్‌లో నా బౌలింగ్‌లో నువ్వు ఆడిన షాట్లు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆన్‌సైడ్‌లో ఫీల్డర్లు లేకుండా చేసి వికెట్లకు దూరంగా బంతిని స్పిన్ చేసినా.. నువ్వు ఎదురుచూసి మరీ ఆన్‌డ్రైవ్ షాట్లు ఆడావు. అప్పుడు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన టెస్టు గుర్తుందా? నిన్ను ఇబ్బంది పెట్టే బంతులు విసిరి వికెట్ సాధించాలనుకుని ప్రణాళికలు వేశాం. అప్పుడు మార్వన్ ఆటపట్టు నా దగ్గరికొచ్చి ఆన్‌సైడ్‌లో ఫీల్డింగ్ లేకపోతే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అప్పుడు బంతి మరీ ఎక్కువగా తిరగడంతో నువ్వు అటువైపు షాట్లు ఆడటానికి ఇబ్బంది పడతావని మేం అంచనావేశాం. కానీ, ఒకే ఓవర్‌లో నువ్వు మిడాన్‌లో మూడు ఫోర్లు కొట్టేసరికి ఆ ప్రణాళిక పనిచేయలేదని ఆటపట్టుకు అర్థమైపోయింది’ అని మురళీధరన్ రెండు దశాబ్దాల కిందటి విశేషాలను పంచుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
agnipath: అగ్నివీరుల కోసం విశాఖలో ఎంపికలు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
K Light 250V Motorcycle: కీవే నుంచి కె లైట్ 250వీ బైక్ @ రూ.2.89 లక్షలు
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ సమం
-
General News
Telangana News: ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం
-
India News
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ప్రతికూల వాతావరణంతో అధికారుల నిర్ణయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!