నట్టూ.. చేయాల్సింది చాలా ఉంది: ఇర్ఫాన్‌

టీమ్‌ఇండియా యువపేసర్‌ టి.నటరాజన్‌ సుదీర్ఘ ఫార్మాట్లో చేయాల్సింది ఇంకెంతో ఉందని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. అతడి బౌలింగ్‌ శైలి అతడికెంతో ప్రయోజనకరంగా ఉందని......

Published : 29 Jan 2021 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువపేసర్‌ టి.నటరాజన్‌ సుదీర్ఘ ఫార్మాట్లో చేయాల్సింది ఇంకెంతో ఉందని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. అతడి బౌలింగ్‌ శైలి అతడికెంతో ప్రయోజనకరంగా ఉందని పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు అతడు కనీసం ఏడెనిమిది ఏళ్లైనా సేవలు అందించాలని సూచించాడు.

తమిళనాడు యువ పేసర్‌ నటరాజన్‌ ఆస్ట్రేలియా సిరీసులో చరిత్ర సృష్టించాడు. నెట్‌ బౌలర్‌గా ఆసీస్‌ చేరుకొని వన్డే, టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదునైన యార్కర్లు, లెంగ్త్‌ బంతులతో కంగారూ ఆటగాళ్లను కంగారు పెట్టాడు. అంతకుముందు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నట్టూ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

‘టెస్టుల్లో నటరాజన్‌ చేయాల్సింది ఇంకెంతో ఉంది. లయ, యాంగిల్‌పై అతడు మరింత కష్టపడాలి. నిజానికి అతడి బౌలింగ్‌ శైలే అతడి అదృష్టం. అయితే బంతి విడిచే తర్వాత దేహాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు బంతి బ్యాట్స్‌మెన్‌ మీదకు వెళ్తుంది. దేశానికి కనీసం 5-7 ఏళ్లు ఆడేలా తొలుత అతడు లక్ష్యం నిర్దేశించుకోవాలి. అందుకోసం ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాలి. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను పూర్తిగా ఉపయోగించాలి. ఆడుతున్నప్పుడు మరిన్ని అస్త్రాలు నేర్చుకోవాలి. అతడు మరింత మెరుగయ్యేందుకు జట్టు యాజమాన్యం కచ్చితంగా కృషి చేస్తుందనే అనుకుంటున్నా’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

ఇవీ చదవండి
దాదాకు మరో 2 స్టెంట్లు అమర్చిన వైద్యులు
ఆసీస్‌ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని