Novak Djokovic : ‘ఇండియన్‌ వెల్స్‌’లోకి జకోవిచ్‌ ఎంట్రీ.. మరి ఆడేందుకు అనుమతి దొరికేనా?

కొవిడ్ వ్యాక్సినేషన్‌ వివాదంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన ..

Updated : 09 Mar 2022 14:13 IST

ఎంట్రీ లిస్ట్‌లో ఉన్నా అమెరికాకు రావడంపై సందిగ్ధత

ఇంటర్నెట్ డెస్క్‌: కొవిడ్ వ్యాక్సినేషన్‌ వివాదంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్‌ స్టార్ నొవాక్ జకోవిచ్‌ ఏటీపీ ఇండియన్‌ వెల్స్‌ టోర్నమెంట్‌ డ్రాలోకి వచ్చేశాడు. అయితే, టోర్నమెంట్‌లో జకో పాల్గొనడంపై స్పష్టత లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘‘కరోనా టీకా వేయించుకోనందున జకోవిచ్‌కు యూఎస్‌ఏలోకి ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుందా..? లేదా..? కాలిఫోర్నియా వేదికగా జరిగే ఇండియన్ వెల్స్‌లో ఆడతాడో లేదో నిర్ణయించడానికి జకో బృందంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే జకో టోర్నీ ఎంట్రీ లిస్ట్‌లో ఉన్నాడు’’ అని ఇండియన్‌ వెల్స్ ఓపెన్‌ నిర్వాహకులు స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. 

జకోవిచ్‌ ఐదుసార్లు ఇండియన్‌ వెల్స్ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే, ఈసారి ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో పాల్గొనాలంటే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయినట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. యూఎస్‌ ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. విదేశీయులు ఎవరైనా సరే అమెరికాలో అడుగు పెట్టాలంటే వ్యాక్సిన్‌ తప్పనిసరి. తాను కరోనా వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదని, అయితే వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని గతంలో జకోవిచ్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ప్రత్యేక అనుమతులు తీసుకుని జకోవిచ్‌ బరిలోకి దిగుతాడో లేదో వేచి చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని