Rohit Sharma : మూడో టెస్టు ఓటమిపై రవిశాస్త్రి వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన రోహిత్‌

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(IND vs AUS)ఓటమిపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఘాటుగా స్పందించాడు.

Updated : 08 Mar 2023 17:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border - Gavaskar Trophy)లో తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను నమోదు చేసిన టీమ్‌ఇండియా(Team India).. మూడో మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమిపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఘాటుగా స్పందించాడు. ‘అతి విశ్వాసమే’ మూడో టెస్టులో టీమ్‌ఇండియా కొంపముంచిందని ఓటమి అనంతరం కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్‌ తాజాగా మాట్లాడుతూ.. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘నిజాయితీగా చెప్పాలంటే.. మేం రెండు మ్యాచ్‌లు గెలిచాం. బయటి వ్యక్తులేమో అతి విశ్వాసం  అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే.. మేం నాలుగు మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా మనం ఆగిపోకూడదు.  ఇలాంటి వ్యాఖ్యలు చేసే బయటి వ్యక్తులు.. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగం కాని వాళ్లకు.. మాలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం చర్చ జరుగుతుందో వాళ్లకు ఏం తెలుస్తుంది ’ అంటూ రోహిత్‌ మండిపడ్డారు. ‘మేం అన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నప్పుడు.. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోం’ అని రోహిత్‌ స్పష్టం చేశాడు.

‘ఇది అతి విశ్వాసం కాదు.. కనికరం లేకుండా ఆడటం. ప్రత్యర్థి జట్టుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ఆడాలని ప్రతి క్రికెటర్‌ మైండ్‌లో ఉంటుంది. మేం అదే మైండ్‌సెట్‌తో ఆడతాం’ అంటూ రోహిత్‌ వివరించాడు.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టు(IND vs AUS).. అహ్మదాబాద్‌ వేదికగా ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని