Yuvraj Singh:‘వన్డే క్రికెట్‌ చచ్చిపోతోందా?’ యువీ ప్రశ్న.. ఇర్ఫాన్‌ పఠాన్‌ సమాధానమిదే!

భారత్, శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేకు అభిమానుల నుంచి ఆశించిన స్పందన లేక సగం స్టేడియం ఖాళీగా కనిపించింది. దీంతో వన్డే క్రికెట్‌ భవిష్యత్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఆందోళన వ్యక్తం చేశాడు. 

Published : 17 Jan 2023 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే క్రికెట్‌ భవిష్యత్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఆందోళన వ్యక్తం చేశాడు. ఆదివారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక, భారత్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శతకాలతో చెలరేగిన  విరాట్‌ కోహ్లీ,  శుభ్‌మన్‌ గిల్‌ను భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా అభినందించాడు. కానీ, అభిమానులు లేక సగం స్టేడియం ఖాళీగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్ చచ్చిపోతోందా? అని ట్వీట్‌ చేశాడు.  

యువీ చేసిన ట్వీట్‌కి టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ( Irfan Pathan)  స్పందించాడు. ‘భాయ్‌.. నువ్వు మళ్లీ క్రికెట్ ఆడు. అభిమానులు వస్తారు’అని యువీ ట్వీట్‌ని ఇర్ఫాన్‌ పఠాన్‌ రీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీలంకతో మూడో వన్డేకు అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం సామర్థ్యం 38,000 కాగా.. 17,000 మంది మాత్రమే మ్యాచ్‌ని వీక్షించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ‘ఇలా సగం స్డేడియం ఎప్పుడూ ఖాళీగా లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో వన్డేలపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా సిరీస్ ఫలితం ముందుగానే తేలడం, ప్రత్యర్థి శ్రీలంక కావడంతో అభిమానులు స్టేడియానికి రాలేదు’ అని కేరళ క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ కృష్ణ ప్రసాద్ అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు