జమాన్‌ మళ్ళీ సెంచరీ.. పాక్‌దే వన్డే సిరీస్‌..

సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్‌ నెగ్గింది.

Published : 08 Apr 2021 14:21 IST

సెంచూరియన్‌: సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్‌ నెగ్గింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంచి లయలో ఉన్న బ్యాట్స్‌మన్‌ ఫఖర్‌ జమాన్‌ వరసగా రెండో సెంచరీ (101, 104 బంతుల్లో, 9x4, 3x6)  నమోదు చేశాడు. సెంచరీ తర్వాత మహారాజ్‌ బౌలింగులో వికెట్‌ కీపర్‌ క్లీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జమాన్‌కి తోడుగా కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (94, 82 బంతుల్లో) కూడా రాణించడంతో పాక్‌ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరంభించిన సఫారీ జట్టు 49.3 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌట్‌ అయింది. జానేమన్‌ మలన్‌ (70, 81 బంతుల్లో, 9x4) సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వెరీన్‌, ఫెలుక్వాయోలు అర్ధసెంచరీలు నమోదు చేసినా సఫారీలకు పరాజయం తప్పలేదు. పాక్‌ బౌలర్లలో మహమ్మద్‌ నవాజ్‌, షహీన్‌షాలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బాబర్‌ అజమ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఫఖర్‌ జమాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇక ఈ శనివారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ఇరు జట్లూ సిద్ధమవుతున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని