India vs Srilanka: శ్రీలంక క్రికెటర్‌కు కరోనా

అనుకున్నదే జరిగింది! వేర్వేరు శిబిరాల్లో బస చేస్తున్న శ్రీలంక క్రికెటర్లలో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది.  దాంతో అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతడితో కలిసున్న వారినీ ప్రత్యేకంగా ఉంచారని తెలిసింది...

Published : 11 Jul 2021 01:06 IST

సందున్‌ వీర్కోడికి పాజిటివ్‌.. 18 నుంచి వన్డేలు

కొలంబో: అనుకున్నదే జరిగింది! వేర్వేరు శిబిరాల్లో బస చేస్తున్న శ్రీలంక క్రికెటర్లలో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది.  దాంతో అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతడితో కలిసున్న వారినీ ప్రత్యేకంగా ఉంచారని తెలిసింది.

శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను లంక బోర్డు రెండు శిబిరాల్లో ఉంచి సాధన చేయిస్తోంది. కొలంబోలో ఉంటున్న బ్యాట్స్‌మన్‌ సందున్‌ వీరక్కోడికి పాజిటివ్‌ వచ్చినట్టు తాజాగా తెలిసింది.

సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్లో వీరక్కోడి మరో 15 మంది సీనియర్‌ క్రికెటర్లతో కలిసి బస చేశాడని శ్రీలంక క్రికెట్‌ వర్గాలు స్థానిక న్యూస్‌వైర్‌కు తెలిపాయి. ఆసక్తికర విషయం ఏంటంటే టీమ్‌ఇండియాతో సిరీసుకు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను ఎస్‌ఎల్‌సీ శుక్రవారం రాత్రి దంబుల్లా పంపించింది. అందులో వీరక్కోడి, భనుక రాజపక్స సహా మరికొందరు ఉన్నారు.

దంబుల్లాలోని ప్రత్యేక బయో బడుగలో 26 మంది క్రికెటర్లు ఉన్నారు. వారంతా బాగానే ఉన్నారని శ్రీలంక క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. వీరక్కోడి ఇంగ్లాండ్‌ నుంచి తిరిగొచ్చిన జట్టులో సభ్యుడు కాకపోవడం గమనార్హం. బ్యాటింగ్‌ కోచ్‌కు కరోనా రావడంతో వారు ఇప్పటికీ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన బయో బుడగలో  13 మంది ఆటగాళ్లు ఉన్నారు.

18 నుంచి వన్డే సిరీసు: జే షా

శ్రీలంకతో వన్డే సిరీసు జులై 18 నుంచి మొదలవుతాయని బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు. లంక క్రికెట్‌ జట్టులో కరోనా కేసులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 17న సిరీస్‌ మొదలవుతుందని శుక్రవారం రాత్రి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై షా స్పష్టతనిచ్చారు. వన్డేలు 18, 20, 23 తేదీల్లో జరుగుతాయని సమాచారం. టీ20 సిరీసు జులై 25 నుంచి కొనసాగుతుందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని