PV Sindhu: భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో మెరిసిన పీవీ సింధు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది....

Updated : 15 Aug 2022 14:40 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

సింధు సాధించిన ఇతర పతకాలు..

* 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం.

* 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం.

* 2018 ఆసియా గేమ్స్‌లో రజతం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని