Asia Cup: నా పాత్ర ఏంటో స్పష్టంగా తెలుసు.. వాటి గురించి తీవ్రంగా ఆలోచించం: రాహుల్‌

ఆసియా కప్‌లో భారత్‌ తన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో టీమ్‌ఇండియాతోపాటు అఫ్గాన్‌కు ప్రయోజనం లేదు. అయితే ఈ మ్యాచ్‌...

Published : 09 Sep 2022 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్‌ తన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో టీమ్‌ఇండియాతోపాటు అఫ్గాన్‌కూ ప్రయోజనం లేదు. అయితే, ఈ మ్యాచ్‌ నుంచి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోగా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ మార్గదర్శకత్వంలో టీమ్‌ఇండియా పాల్గొన్న తొలి మెగా టోర్నీ ఇదే. ఈ సందర్భంగా కోచ్‌గా తన పాత్రపై స్పష్టతతో ఉన్నానని భారత్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ తెలిపాడు. 

‘‘టీమ్‌ఇండియా క్రికెట్‌లో నా పాత్ర ఏంటో స్పష్టంగా తెలుసు. జట్టు సభ్యులకు, కెప్టెన్‌కు మద్దతు ఇవ్వడమే నా పని. వారిలోని ఉత్తమ ప్రతిభను వెలికి తీసేందుకు సాయపడతా. అయితే మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం కెప్టెన్‌, ఆటగాళ్లు మాత్రమే ప్రణాళికలను అమలు చేస్తారు. ఆసియా కప్‌ సూపర్‌-4లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయాం. ఇలాంటి పిచ్‌లపై ఛేదనలో ప్రత్యర్థులను కట్టడి చేయడం అంత సులువేం కాదు. ఏదో రెండు మ్యాచ్‌లను ఓడిపోయాం కాబట్టి మమ్మల్ని ఓ భయంకరమైన జట్టుగా చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఓటముల గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉండం. మేం గెలిచినా.. ఓడినా ఒకేలా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మా మార్గంలో మేం ఇలానే ముందుకు సాగుతాం’’ అని రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించాడు. సెప్టెంబర్‌ 20 నుంచి  25 వరకు ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని