
Ravi Shastri - Rohit Sharma: రోహిత్‌కు విరామం అవసరం లేదు: శాస్త్రి
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరామం అవసరం లేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ముంబయి కెప్టెన్ రోహిత్ తంటాలు పడిన సంగతి తెలిసిందే. అతడు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 19.14 సగటుతో 268 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశకతం కూడా లేదు. ఇక అత్యుత్తమ స్కోర్ 48 పరుగులే. ఈ నేపథ్యంలోనే రోహిత్‌పై స్పందించిన రవిశాస్త్రి.. హిట్‌మ్యాన్‌కు విరామం ఇవ్వాలా.. వద్దా..? అనే విషయంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.
‘రోహిత్‌కు విరామం అవసరం లేదు. మరోవైపు కోహ్లీ విషయానికి వస్తే.. అతడు ఏడాదిన్నరకుపైగా ఫార్మాట్లకు అతీతంగా క్రికెట్ ఆడుతున్నాడు. రోహిత్ గాయాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత జట్టుకు దూరమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు ఆస్ట్రేలియా టూర్‌కు సగంలోనే వెళ్లాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు మొత్తానికే దూరమయ్యాడు. కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ముంబయి ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాక సుమారు రెండు వారాలు సమయం ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు అతడికి ఆ విరామం చాలు’ అని రవిశాస్త్రి ఓ క్రీడాఛానల్‌తో చెప్పాడు. కాగా, ఇదే టీ20లీగ్‌లో కోహ్లీ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న వేళ శాస్త్రి స్పందిస్తూ.. అతడికి కొద్ది కాలం విశ్రాంతి అవసరమని చెప్పిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Pakistan: ఆర్థిక సంక్షోభ నివారణకు పాక్ ‘లస్సీ’ మంత్రం!
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
-
Politics News
Maharashtra: బాలాసాహెబ్, శివసేన పేర్లు ఇతరులు వాడొద్దు.. ఈసీని ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం..!
-
General News
Telangana News: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు
-
Politics News
BJP: కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం: తరుణ్ చుగ్
-
Business News
Bharat NCAP: మన కార్లకు స్టార్ రేటింగ్ ఎప్పటి నుంచంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు