Tokyo Olympics:  సిమోన్‌ బైల్స్‌కు అండగా రవిశాస్త్రి

మానసిక ఒత్తిడి కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్న అమెరికా స్టార్‌ అథ్లెట్‌ సిమోన్‌ బైల్స్‌కు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అండగా  నిలిచాడు. ఆమె తీసుకున్న నిర్ణయంపై ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. తాజా ఒలింపిక్స్‌ క్రీడల్లో జిమ్నాస్టిక్స్‌ విభాగంలో ఫైనల్‌ రేసు

Published : 30 Jul 2021 00:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మానసిక ఒత్తిడి కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్న అమెరికా స్టార్‌ అథ్లెట్‌ సిమోన్‌ బైల్స్‌కు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అండగా  నిలిచాడు. ఆమె తీసుకున్న నిర్ణయంపై ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. తాజా ఒలింపిక్స్‌ క్రీడల్లో జిమ్నాస్టిక్స్‌ విభాగంలో ఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్న బైల్స్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలిచారు. అందులో టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి ఉండటం గమనార్హం. బైల్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శాస్త్రి ట్విటర్‌లో ఇలా స్పందించాడు.

‘సిమోన్‌ నీకు కావాల్సినంత విశ్రాంతి తీసుకో. ఈ వయసులో నీకు కావాల్సిన నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. అది 48 గంటలైనా.. లేదా 48 రోజులైనా కావచ్చు. దాన్ని పూర్తిచెయ్‌. ఈ విషయంపై నువ్వు ఎవ్వరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నవోమీ ఒసాకా నువ్వు కూడా. మీ ఇద్దరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమీ ఒసాకా సైతం ఇటీవల ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగం నుంచి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ మానసిక ఒత్తిడితో ఆమె ఇలాగే వైదొలగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని