PAK vs AFG: పాకిస్థాన్‌కు షాక్‌ తప్పదా? దంచికొడుతున్న అఫ్గాన్ బ్యాటర్లు

ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు షాక్ తగిలే ఉంది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. 25 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో నిలిచింది.

Updated : 23 Oct 2023 20:17 IST

చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు షాక్ తగిలే ఉంది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. 25 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో నిలిచింది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్భాజ్ (65; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్‌ (74*; 87 బంతుల్లో 9 ఫోర్లు) ధాటిగా ఆడుతున్నాడు. ఈ జోడీ  పాక్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఇన్నింగ్స్ మొదటి రెండు ఓవర్లలో జాద్రాన్ మూడు ఫోర్లు బాదాడు. హారిస్ రవూఫ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో గుర్భాజ్‌ ఏకంగా నాలుగు బౌండరీలు రాబట్టాడు. ఈ క్రమంలో స్కోరు 20 ఓవర్లకు స్కోరు 128/0కి చేరింది.  22 ఓవర్‌లో గుర్భాజ్‌ను షాహీన్ అఫ్రిది ఔట్ చేయడంతో 130 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. జాద్రాన్‌కు తోడుగా రహ్మత్ షా (8*) క్రీజులో ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని