‘ఐసీసీ విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో స్మృతి మంధాన

మహిళా క్రికెట్లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంధాన ‘ఐసీసీ విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో నిలిచింది. ఈ ఏడాది గొప్పగా రాణించిన నలుగురు అత్యుత్తమ మహిళా క్రికెటర్ల పేర్లను ఐసీసీ..

Published : 31 Dec 2021 22:28 IST

(Photo : Smrithi Mandhana Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళా క్రికెట్లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంధాన ‘ఐసీసీ విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో నిలిచింది. ఈ ఏడాది గొప్పగా రాణించిన నలుగురు అత్యుత్తమ మహిళా క్రికెటర్ల పేర్లను ఐసీసీ ఇటీవల నామినేట్‌ చేసింది. భారత్ నుంచి స్మృతి మంధానను ఎంపిక చేయగా.. టామీ బీమోంట్‌ (ఇంగ్లాండ్‌), లీజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్‌ (ఐర్లాండ్‌)లను ఐసీసీ నామినీలుగా ఎంపిక చేసింది.

ఈ ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన మంధాన 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, ఐదు అర్ధ శతకాలున్నాయి. భారత జట్టు ఈ ఏడాదిని పేలవంగానే ముగించినా.. స్మృతి మంధాన మాత్రం మెరుగైన ప్రదర్శనే చేసింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన 8 మ్యాచుల్లో భారత్ కేవలం రెండింట్లోనే గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మంధాన బ్యాటుతో రాణించి టీమ్‌ఇండియా విజయాల్లో కీలకంగా వ్యవహరించడం గమనార్హం. ఓ మ్యాచ్‌లో 80, మరో మ్యాచ్‌లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మంధాన 78 పరుగులు చేసి.. మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకంగా వ్యవహరించింది.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని